33 మండలాల్లో తేలికపాటి వర్షం | rain information | Sakshi
Sakshi News home page

33 మండలాల్లో తేలికపాటి వర్షం

Sep 2 2017 10:34 PM | Updated on Jun 1 2018 8:45 PM

జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడ్డాయి. శనివారం కూడా 33 మండలాల్లో వర్షపాతం నమోదైంది.

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడ్డాయి. శనివారం కూడా 33 మండలాల్లో వర్షపాతం నమోదైంది. కదిరి 23.7 మి.మీ, అమడగూరు 13.4 మి.మీ, బుక్కపట్టణం 12.6 మి.మీ వర్షం పడింది. చిలమత్తూరు, సోమందేపల్లి, రొద్దం, పెనుకొండ, పుట్టపర్తి, ఓడీ చెరువు, నల్లచెరువు, తనకల్లు, ధర్మవరం, రాప్తాడు తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ప్రస్తుతానికి 2.1 మి.మీ నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement