తేలికపాటి వర్షసూచన | rain information | Sakshi
Sakshi News home page

తేలికపాటి వర్షసూచన

Sep 1 2017 9:16 PM | Updated on Jun 1 2018 8:45 PM

రాగల నాలుగు రోజుల్లో జిల్లాకు తేలికపాటి వర్ష సూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌: రాగల నాలుగు రోజుల్లో జిల్లాకు తేలికపాటి వర్ష సూచన ఉందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈనెల 2 నుంచి 6వ తేదీ వరకు 8 నుంచి 17 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 32 నుంచి 34, కనిష్టం 23 నుంచి 24 డిగ్రీలు ఉండవచ్చని తెలిపారు. గాలిలో తేమశాతం ఉదయం 85 నుంచి 88, మధ్యాహ్నం 64 నుంచి 69 శాతం మధ్య ఉండవచ్చన్నారు. గంటకు 7 నుంచి 9 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement