తేలికపాటి వర్షసూచన | rain information | Sakshi
Sakshi News home page

తేలికపాటి వర్షసూచన

Nov 29 2016 10:40 PM | Updated on Jun 1 2018 8:39 PM

రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్‌ అధికారి డాక్టర్‌ బి.సహదేవరెడ్డి మంగళవారం తెలిపారు.

అనంతపురం అగ్రికల్చర్‌ : రాగల నాలుగు రోజుల్లో తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బి.రవీంద్రనాథరెడ్డి, నోడల్‌ అధికారి డాక్టర్‌ బి.సహదేవరెడ్డి మంగళవారం తెలిపారు. 2, 3, 4 తేదీల్లో 4 నుంచి 7 మి.మీ మేర వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 26 నుంచి 31, రాత్రిళ్లు 16 నుంచి 22 డిగ్రీలు నమోదు కావచ్చన్నారు. కాగా మంగళవారం అగళి మండలంలో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 35 డిగ్రీలు, కనిష్టం 13 నుంచి 16 డిగ్రీల వరకు కొనసాగాయి.

Advertisement
 
Advertisement
Advertisement