రేడియాలజిస్ట్ రత్నాకర్ సస్పెన్షన్ | Radiologist ratnakar suspended | Sakshi
Sakshi News home page

రేడియాలజిస్ట్ రత్నాకర్ సస్పెన్షన్

Jan 22 2016 10:16 AM | Updated on Jul 23 2018 9:13 PM

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మహిళా రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న రేడియాలజిస్ట్ రత్నాకర్పై సస్పెన్షన్ వేటు పడింది.

విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మహిళా రోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న రేడియాలజిస్ట్ రత్నాకర్పై సస్పెన్షన్ వేటు పడింది. శుక్రవారం ఈ మేరకు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నేడు ఆసుపత్రిలో విచారణ చేయనున్నారు. దీనిపై ఆయన ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.

విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన మహిళాల పట్ల వైద్యులు, సిబ్బంది అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.  అందులోభాగంగా రేడియాలజిస్ట్ రత్నాకర్ను సస్పెండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement