గండికోట ఇదేరా.. | movie shooting in gandikota | Sakshi
Sakshi News home page

గండికోట ఇదేరా..

Mar 3 2016 3:33 AM | Updated on Sep 3 2017 6:51 PM

గండికోట ఇదేరా..

గండికోట ఇదేరా..

ప్రముఖ సినీ డెరైక్టర్ నీలకంఠ ఆధ్వర్యంలో బుధవారం గండికోటపై థీం సాంగ్ చిత్రీకరించారు.

ప్రముఖ సినీ డెరైక్టర్ నీలకంఠ ఆధ్వర్యంలో బుధవారం గండికోటపై థీం సాంగ్ చిత్రీకరించారు. గండికోట అందాలను దేశ నలుమూలలా చాటడానికి రాష్ట్ర పర్యాటక శాఖ తొలి యత్నంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జమ్మలమడుగు పట్టణంలోని ఈడిగ పేటకు చెందిన 30 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో హీరో రోహిత్, హీరోహిన్ శ ృతియుగల్‌తో ‘ఇదేరా.. గండికోట ఇదేరా..’ అంటూ పాటను చిత్రీకరించారు. గండికోట చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల మేర డ్రోన్‌లకు అమర్చిన కెమెరాలలో ప్రకృతి అందాలను బంధించారు. ఈ సందర్భంగా నీలకంఠ మాట్లాడుతూ గండికోటలోని జుమ్మామసీద్, మాదవరాయస్వామి ఆలయం, పెన్నా నది లోయ, తదితర ప్రాంతాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ద ృష్టి సారిస్తే ఈ ప్రాంతం ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

                   - జమ్మలమడుగు రూరల్

Advertisement
 
Advertisement
Advertisement