ఫ్యాక్షన్ గ్రామంలో కలెక్టర్, ఎస్పీ నిద్ర | kurnool district collector, SP sleeps in faction village | Sakshi
Sakshi News home page

ఫ్యాక్షన్ గ్రామంలో కలెక్టర్, ఎస్పీ నిద్ర

Feb 1 2016 7:57 PM | Updated on Mar 21 2019 8:35 PM

కర్నూలు జిల్లా అధికారులు ఫ్యాక్షన్ గ్రామంలో సోమవారం నిద్రించనున్నారు.

దేవరకొండ: కర్నూలు జిల్లా అధికారులు ఫ్యాక్షన్ గ్రామంలో సోమవారం నిద్రించనున్నారు. దేవరకొండ మండలంలోని కప్పట్రాళ్ల గ్రామంలో కలెక్టర్ విజయ్ మోహన్, ఎస్పీ విజయకృష్ణ సోమవారం నిద్ర చేయనున్నారు.

ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల ప్రజలతో మమేకమై, వారి సమస్యలు, అందుతున్న సంక్షేమ పధకాల ఫలితాల గురించి తెలుసుకునేందుకు గ్రామంలో నిద్రచేయాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం సాయంత్రం గ్రామానికి చేరుకున్న అధికారులు వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామంలోని రెవెన్యూ కార్యాలయం భవనంలో వారు నిద్ర చేయనున్నారు. అధికారుల నిర్ణయంపై గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement