భార్య హత్య కేసులో భర్త అరెస్టు | husband arrest of wife murder case | Sakshi
Sakshi News home page

భార్య హత్య కేసులో భర్త అరెస్టు

Mar 1 2017 9:46 PM | Updated on Sep 5 2017 4:56 AM

భార్య హత్య కేసులో నిందితుడైన భర్తను బుక్కపట్నం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

బుక్కపట్నం (పుట్టపర్తి) : భార్య హత్య కేసులో నిందితుడైన భర్తను బుక్కపట్నం పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపిన మేరకు.. బుక్కపట్నం ఈడిగ వీధికి చెందిన పెనిమేటి నారాయణస్వామి 20 ఏళ్ల కిందట అనుమానంతో భార్య సుగుణమ్మను హత్య చేశాడు. నిందితుడు అప్పటి నుంచి పరారీలో ఉండటంతో వారెంట్‌ జారీ అయ్యింది. అందిన సమాచారం మేరకు నారాయణస్వామిని పోలీసులు అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు. నిందితుడిని పట్టుకోవటంలో ఏఎస్‌ఐ గోవిందు చూపిన కృషిని ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్, కొత్తచెరువు సీఐ శ్రీధర్‌ అభినందించారని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement