చిరుతల కాళ్లు నరికి తీసుకెళ్లిన వేటగాళ్లు ! | hunter attacked by leopard in khammam district | Sakshi
Sakshi News home page

చిరుతల కాళ్లు నరికి తీసుకెళ్లిన వేటగాళ్లు !

Jul 3 2016 11:58 AM | Updated on Sep 4 2017 4:03 AM

చిరుతల కాళ్లు నరికి తీసుకెళ్లిన వేటగాళ్లు !

చిరుతల కాళ్లు నరికి తీసుకెళ్లిన వేటగాళ్లు !

ఖమ్మం జిల్లా చంద్రుగొండు మండలం అబ్బూగూడెంలో రెండు చిరుతలు మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం గుర్తించారు.

ఖమ్మం: ఖమ్మం జిల్లా చంద్రుగొండు మండలం అబ్బూగూడెంలో రెండు చిరుతలు మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం గుర్తించారు. దీనిపై అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని...రెండు చిరుతల మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు.

వేటగాళ్లు పెట్టిన విషాహారం తిని రెండు చిరుతలు మరణించినట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. చిరుతల కాళ్లు నరికి వేటగాళ్లు తీసుకెళ్లినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement