మార్కెట్‌లోకి హోండా షైన్‌ వాహనాలు | honda shine vehicles in market | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి హోండా షైన్‌ వాహనాలు

Feb 22 2017 12:08 AM | Updated on Sep 5 2017 4:16 AM

హోండా షైన్, షైన్‌ ఎస్‌పీ బీఎస్‌ 4 ద్విచక్రవాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేశారు.

అనంతపురం సెంట్రల్‌ : హోండా షైన్, షైన్‌ ఎస్‌పీ బీఎస్‌ 4 ద్విచక్రవాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేశారు. మంగళవారం రైల్వేఫీడర్‌ రోడ్డులోని శివసాయి హోండా షోరూంలో హోండా ఏరియా సేల్స్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హోండా అధికృత డీలర్‌ మల్లికార్జున మాట్లాడుతూ షైన్‌ ద్విచక్ర వాహనం 50 లక్షల అమ్మకాల మైలురాయిని అధిగమించిందని, 125 సీసీ సెగ్మెంట్‌లో షైన్‌ అత్యధికంగా అమ్ముడుపోతోందని వివరించారు. ప్రస్తుతం హెచ్‌ఈటీ టెక్నాలజీతో సరికొత్త వాహనాలను రూపొందించిందని తెలిపారు. కార్యక్రమంలో  శివసాయి హోండా సిబ్బంది, టూ వీలర్స్‌ ఫైనాన్షియర్స్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement