‘బంగారు’ గణపయ్య | gold ganesha in contonement | Sakshi
Sakshi News home page

‘బంగారు’ గణపయ్య

Sep 4 2016 9:57 PM | Updated on Sep 4 2018 5:21 PM

రాణాప్రతాప్‌ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఫైబర్‌ గణపతి మండపం, సోమవారం ఆవిష్కరించనున్న ఫైబర్‌ గణపతి ప్రతిమ - Sakshi

రాణాప్రతాప్‌ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఫైబర్‌ గణపతి మండపం, సోమవారం ఆవిష్కరించనున్న ఫైబర్‌ గణపతి ప్రతిమ

సుమారు రూ.లక్ష విలువ చేసే ‘ఫైబర్‌ గణపతి’ని పుణేలో ప్రత్యేకంగా తయారు చేయించిన నిర్వాహకులు

కంటోన్మెంట్‌ : బోయిన్‌పల్లిలో రెండు దశాబ్దాలుగా ప్రతీయేటా వినూత్న రీతిలో గణపతి మండలపాలను ఏర్పాటు చేస్తున్న రాణా ప్రతాప్‌ యువసేన ఈ సారి గణపతిని బంగారు వెండిమయం చేస్తున్నారు. సుమారు రూ.లక్ష విలువ చేసే ‘ఫైబర్‌ గణపతి’ని పుణేలో ప్రత్యేకంగా తయారు చేయించిన నిర్వాహకులు... గణపతికి కేజీ బంగారం చైన్, నాలుగు కేజీల వెండి కిరీటాన్ని సైతం తయారు చేయించారు.

ఈ మేరకు సోమవారం సాయంత్రం జరిగే గణపతి కలశ స్థాపనలో ఆయా ఆభరణాల్ని అలంకరించనున్నారు. కాగా ఫైబర్‌ గణపతిని బోయిన్‌పల్లి హనుమాన్‌ దేవాలయంలో ప్రతిష్టంచనుండగా, ఆభరణాలను రాణాప్రతాప్‌ యువసేన ఆధ్వర్యంలో బ్యాంకులో భద్రపరచనున్నట్లు నిర్వాహకులు జంపన ప్రతాప్, ఆనంద్‌బాబు, గోవర్థన్‌రెడ్డి, అరుణ్‌ కుమార్‌ తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement