ఎన్‌జీఓ అసోషియేషన్‌ జిల్లా అధ్యక్షుడిపై విచారణ | enquiry on ngo association district president | Sakshi
Sakshi News home page

ఎన్‌జీఓ అసోషియేషన్‌ జిల్లా అధ్యక్షుడిపై విచారణ

Mar 27 2017 11:47 PM | Updated on Oct 17 2018 5:10 PM

నాన్‌ గజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోషియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్‌ వెంగళరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ వెంకటసుబ్బారెడ్డి విచారణ జరిపారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): నాన్‌ గజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోషియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వీసీహెచ్‌ వెంగళరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ వెంకటసుబ్బారెడ్డి విచారణ జరిపారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే రామచంద్రరావు.. వెంగళరెడ్డిపై వివిధ ఆరోపణలతో గతంలో లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ మేరకు లోకాయుక్త సమగ్రంగా విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కలెక్టర్‌.. ప్రత్యేక కలెక్టర్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఇందులో భాగంగా  ఫిర్యాదు దారుడయిన రామచంద్రరావును సోమవారం విచారించారు. ఆయన తన దగ్గర ఉన్న ఆధారాలను విచారణ అధికారికి సమర్పించారు. అనంతరం ఆరోపణలపై వెంగళరెడ్డిని విచారించారు. ఆరోపణలకు సంబంధించి ఆయన స్టేట్‌మెంట్‌ కూడా రికార్డు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement