టీడీపీకి అధికారం బీజేపీ భిక్షే | BJP Fire | Sakshi
Sakshi News home page

టీడీపీకి అధికారం బీజేపీ భిక్షే

Aug 1 2016 8:34 PM | Updated on Mar 29 2019 9:31 PM

టీడీపీకి అధికారం బీజేపీ భిక్షే - Sakshi

టీడీపీకి అధికారం బీజేపీ భిక్షే

భారతీయ జనతాపార్టీ చలవతో గెలిచి ఏరు దాటి తెప్ప తగలేసే మాటలు మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ పొత్తును తెంచుకుంటామంటే ఉంచుకోవడానికి మేం సిద్ధంగా లేమని బిజెపి జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి ధ్వజమెత్తారు.

కృత్తివెన్ను : భారతీయ జనతాపార్టీ చలవతో గెలిచి ఏరు దాటి తెప్ప తగలేసే మాటలు మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ పొత్తును తెంచుకుంటామంటే ఉంచుకోవడానికి మేం సిద్ధంగా  లేమని బిజెపి జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి ధ్వజమెత్తారు. సోమవారం కృత్తివెన్నులో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అనుభవిస్తున్న అధికారం ప్రధాని మోడి, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ల భి„ó నన్న సంగతిని టీడీపీ మరవకూడదన్నారు. 2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తులేకుంటే టిడిపి గతేంటో ప్రజలతో పాటు ఆ పార్టీ నాయకులకు తెలుసన్నారు. తెలుగుదేÔ¶ ంలో కొందరు ఎంఎల్‌ఏ, ఎంపిలు వారి స్థాయిని మరిచి ప్రధాన మంత్రిని విమర్శించడం వారి చౌకబారు తనాన్ని తెలియజేస్తోందన్నారు. వెంకయ్య నాయుడును విమర్శించే స్థాయి టిడిపి నాయకులకు లేదన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలను చంద్రబాబు హైజాక్‌ చేసి తన పేరు పెట్టుకుంటున్నాడని ఇంతకంటే సిగ్గుమాలిన చర్య మరొకటి ఉండదని ఆయన ఎద్దేవాచేశారు.  పొత్తు ఇష్టం లేకపోతే చంద్రబాబు ఒక్కమాట చెప్తే చాలు, అంతేకానీ  చోటా నాయకులతో మొరిగించడం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుప్పాల రాము, మండల పార్టీ అధ్యక్షులు దాసరి వెంకట శ్రీనివాస్, పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు.
ఫొటో..
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement