హైదరాబాద్ లో బాలుడి కిడ్నాప్:రూ. కోటి డిమాండ్ | 8 years boy kidnaped in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో బాలుడి కిడ్నాప్:రూ. కోటి డిమాండ్

Sep 12 2015 9:25 PM | Updated on Sep 4 2018 5:16 PM

హైదరాబాద్ లో నగరంలోని ఎల్‌బి నగర్‌లో ఎనిదేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బబ్లూ అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి కిడ్నాప్‌ చేశారు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిని ఎత్తుకుపోయారు.

హైదరాబాద్‌: నగరంలోని ఎల్‌బి నగర్‌లో ఎనిదేళ్ల బాలుడ్ని కిడ్నాప్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.  ప్రగతి విజయ్ పాత్రో  మార్బుల్ యజమాని కుమారుడైన విజయ్ (బబ్లూ ) అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి కిడ్నాప్‌ చేశారు.  బాలుడు ఇంటిముందు ఆడుకుంటున్న సమయంలోనే కిడ్నాప్ చేశారు.  ఆపై బాలుని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు.

 

బాలుడిని  వదిలి పెట్టాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాలుడిని చంపేస్తామని  బెదిరింపులకు దిగారు. ఈ మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. దుండగులు 9949892673, 9866625454 అనే రెండు మొబైల్ నంబర్ల నుంచి బాలుడి తండ్రి ఆశిష్‌కు ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు తెలిసింది.  ఆతర్వాత లొకేషన్ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఫోన్‌ను స్విచ్ఛాప్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement