నీటమునిగి వీడియోగ్రాఫర్‌ మృతి | videographer dead in pond | Sakshi
Sakshi News home page

నీటమునిగి వీడియోగ్రాఫర్‌ మృతి

Nov 1 2017 8:11 AM | Updated on Sep 17 2018 8:02 PM

videographer dead in pond - Sakshi

బోరున విలపిస్తున్న భార్య నందిని (ఇన్‌సెట్‌లో)వీరనారాయణ (ఫైల్‌)

కదిరి అర్బన్‌: కదిరిలోని నల్లగుట్టవీధికి చెందిన వీడియోగ్రాఫర్‌ వీరనారాయణ (24) మంగళవారం ముత్యాలచెరువు గ్రామంలోని చెరువులో నీటమునిగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వీరనారాయణ పట్టణంలోని రాము ఫొటో స్టూడియోలో వీడియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం స్నేహితులతో కలిసి సరదాగా ముత్యాలచెరువు గ్రామంలోని చెరువులో ఈతకెళ్లాడు. నీటి మధ్యలోకి వెళ్లాక ఊపిరాడక మృతి చెందాడు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. నాలుగు నెలల కిందటే వీరనారాయణకు వివాహమైంది. భర్త మృతి చెందిన విషయం తెలుసుకున్న భార్య నందిని బోరున విలపించింది.

Advertisement
 
Advertisement
Advertisement