ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టుకుని... | Software Engineer Committed Suicide At Madhapur | Sakshi
Sakshi News home page

ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టుకుని ఆత్మహత్య

Feb 16 2019 3:49 PM | Updated on Feb 16 2019 7:25 PM

Software Engineer Committed Suicide At Madhapur - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. శ్రీవిద్య (25) అనే  సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఊపిరి ఆడకుండా ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అరుణోదయ కాలనీలో శనివారం ఈ ఘటన  జరిగింది. ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్న శ్రీవిద్య.. హాస్టల్‌ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. రాత్రి నుంచి తలుపులు తియ్యకపోవడంతో అనుమానం వచ్చిన హాస్టల్‌ సిబ్బంది బలవంతంగా తలుపులు తెరవడంతో అప్పటికే మృతిచెందింది.

స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. మృతురాలికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement