అన్నా క్యాంటీన్‌లో వ్యభిచార బాగోతం! | Prostitution Scandal Out In Hindupur Anna Canteen | Sakshi
Sakshi News home page

అన్నా క్యాంటీన్‌లో వ్యభిచార బాగోతం!

Jan 13 2019 8:06 AM | Updated on Jan 13 2019 8:33 AM

Prostitution Scandal Out In Hindupur Anna Canteen - Sakshi

హిందూపురం అన్నా క్యాంటీన్‌

శనివారం రాత్రి వాచ్‌మెన్‌ జయరాం ఓ మహిళతో రాసలీలలు జరుపుతుండగా...

సాక్షి, హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురంలోని అన్నా క్యాంటీన్‌లో వ్యభిచార బాగోతం బట్టబయలు అయ్యింది. హిందూపురం  ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న అన్నా క్యాంటీన్‌లో రాత్రి వేళల్లో వ్యభిచారం జరుగుతోందన్న ఆరోపణలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నాయి. కాగా శనివారం రాత్రి వాచ్‌మెన్‌ జయరాం ఓ మహిళతో రాసలీలలు జరుపుతుండగా స్థానికులు పట్టుకున్నారు. అనంతరం మీడియాకు సమాచారమిచ్చారు.

అన్నా క్యాంటీన్‌ మేనేజర్‌ కృష్ణా, వాచ్‌మెన్‌ జయరాంలను మీడియా ప్రతినిధులు నిలదీయటంతో వారు పొంతనలేని సమాధానాలు ఇవ్వటం పలు అనుమానాలకు తావిస్తోంది. చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చినా కనీసం విచారించకుండానే అందర్నీ వదిలేయటం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement