పురుగు మందు తాగి వృద్ధుడి మృతి | Old Man Committed Suicide | Sakshi
Sakshi News home page

పురుగు మందు తాగి వృద్ధుడి మృతి

Jul 7 2018 12:17 PM | Updated on Jul 7 2018 12:17 PM

Old Man Committed Suicide  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పూసపాటిరేగ : పురుగు మందు తాగి వృద్ధుడు మృతి చెందిన సంఘటన మండలంలోని చల్లవానితోట పంచాయతీ బూర్లెవానికల్లంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన లెంక పైడినాయుడు (68) మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు.

ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం పురుగు మందు తాగాడు. వెంటనే బంధువులు గమనించి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మృతదేహానికి  పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పూసపాటిరేగ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement