పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

Published Tue, May 8 2018 10:05 AM

Man cheats girl in Guntur - Sakshi

గుంటూరు: ‘మా అన్నయ్య కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రూ.లక్ష జీతం అతడిని పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం’ అంటూ ఓ యువతితో పరిచయం పెంచుకున్న యువకుడు, ఆ తరువాత తన అన్నకు పెళ్లయిందని, తానే వివాహం చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. శారీరక సంబంధం పెట్టుకుని, పెళ్లికి తన తండ్రి అంగీకరించడంలేదంటూ చివరికి ముఖం చాటేశాడు. బాధితురాలు సోమవారం రూరల్‌ అదనపు ఎస్పీ వరదరాజు వద్ద కన్నీటి పర్వంతమైంది. ఆమె కథనం మేరకు.. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన యువతి బీటెక్‌ చదివి ఓ ప్రయివేటు ఆస్పత్రిలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. ఆమెకు వివాహం చేసేందుకు తల్లి, అమ్మమ్మ సంబంధాలు చూస్తున్నారు. కువైట్‌లో ఉద్యోగం చేస్తున్న తెనాలి మండలం జగడగుంటపాలేనికి చెందిన తాడిబోయిన తాడయ్య పెద్ద కుమార్డు రాజేష్‌ సంబంధం వారి దృష్టికి వచ్చింది. కట్నం విషయంలో తేడాలు రావడంతో మిగిలిన విషయాలను తన చిన్న కుమారుడు రమేష్‌తో మాట్లాడలని తాడయ్య యువతి తల్లికి చెప్పి, అతని ఫోన్‌ నంబరు ఇచ్చారు. అప్పటి నుంచి రమేష్‌ ఆ యువతి, ఆమె తల్లితో ఫోన్‌లో మాట్లాడేవాడు.

కొద్ది రోజుల తర్వాత తన అన్నకు మరో యువతితో పెళ్లిచేస్తున్నామని చెప్పాడు. ఆ తరువాత తానే పెళ్లి చేసుకుంటానంటూ ఫోన్‌ మెస్సేజ్‌లు, ఫేస్‌బుక్‌ ద్వారా యువతికి దగ్గరయ్యాడు. విజయవాడ, ఉండవల్లి ప్రాంతాలకు ఇద్దరు రహస్యంగా వెళ్లొస్తున్న క్రమంలో ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. ఆ తరువాత పెళ్లికి తన తండ్రి ఒప్పుకోవడంలేదని రమేష్‌ ముఖం చాటేశాడు. తాను మోసపోయానని, న్యాయం చేయాలని ఆ యువతి ఏఎస్పీని వేడుకుంది. ఏఎస్పీ స్పందించి యువతికి న్యాయం చేయాలని తెనాలి డీఎస్పీ స్నేహితను ఆదేశించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement