జీవిత ఖైదీ ఆత్మహత్య  | Life prisoner suicide | Sakshi
Sakshi News home page

జీవిత ఖైదీ ఆత్మహత్య 

Apr 9 2018 3:14 AM | Updated on Nov 6 2018 8:16 PM

Life prisoner suicide - Sakshi

వరంగల్‌: వరంగల్‌ సెంట్రల్‌ జైలులో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న పండారి కిషన్‌ (48) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతున్న కిషన్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందతూ మృతిచెందాడు. జైలు సూపరింటెండెంట్‌ మురళీబాబు కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కిన్వట్‌ తాలుకా మల్క్వాడి కి చెందిన పండారి కిషన్‌కు ఓ హత్య కేసులో ఆదిలాబాద్‌ జిల్లా కోర్టు 2014లో జీవితఖైదు శిక్షను విధించింది.

అప్పటి నుంచి కిషన్‌ వరంగల్‌ సెంట్రల్‌ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే భార్య తల్లిని చంపిన కేసులో ముద్దాయి కావడంతో భార్యతో పాటు ముగ్గురు పిల్లలు అతడిని చూసేందుకు మూడేళ్లుగా రాలేదు. ఈ క్రమంలో ఆదివారం టిఫిన్‌ చేసిన కిషన్‌ బాత్‌రూమ్‌కు వెళ్లి తాడుతో ఉరి వేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కిషన్‌ మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement