క్యాబ్‌ డ్రైవర్‌ ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

క్యాబ్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

Published Sat, Oct 21 2017 2:14 AM

Cab driver suicide in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అనుమానాస్పద స్థితిలో ఓ క్యాబ్‌డ్రైవర్‌ ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం హైదరాబాద్‌ ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం తుమ్మలగూడెంకు చెందిన నాగమహేశ్‌ క్యాబ్‌ డ్రైవర్‌. కొంతకాలంగా ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని బీరప్పగడ్డలో నివాసం ఉంటున్నాడు. స్థానిక ఫైనాన్స్‌ వ్యాపారుల వద్ద అప్పు తీసుకున్నాడు. వారు డబ్బులు తిరిగి చెల్లించాలని ఒత్తిడి తేవడంతో మనస్తాపానికి గురైన నాగమహేశ్‌ శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఫైనాన్స్‌ వ్యాపారుల వేధింపులే నాగమహేశ్‌ మృతికి కారణమని, ఆయన మృతికి సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేసి వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. నాగమహేశ్‌ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement