యమహా సాల్యుటో ఆర్‌ఎక్స్‌ అదరహా.. | Yamaha Saluto RX Motorcycle Launch | Sakshi
Sakshi News home page

యమహా సాల్యుటో ఆర్‌ఎక్స్‌ అదరహా..

Apr 14 2016 4:45 PM | Updated on Sep 3 2017 9:55 PM

యమహా  సాల్యుటో ఆర్‌ఎక్స్‌ అదరహా..

యమహా సాల్యుటో ఆర్‌ఎక్స్‌ అదరహా..

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ యమహా సాల్యుటో ఆర్‌ఎక్స్‌ 110 సీసీ పేరుతో ఓ స్మాటీ అండ్ స్పోర్టీ బైక్‌ను గురువారం అట్టహాసంగా విడుదల చేసింది


న్యూఢిల్లీ : జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ యమహా మరో కొత్త మోడల్‌ బైక్‌ను భారత మార్కెట్లో  లాంచ్ చేసింది. 125  సీసీ  సెగ్మెంట్ లో  స్మాటీ అండ్  స్పోర్టీ  బైక్‌  సాల్యుటో ఆర్‌ఎక్స్‌ ను  గురువారం  అట్టహాసంగా విడుదల చేసింది. ఢిల్లీ  ఎక్స్‌షోరూం లో దీని ధర రూ. 46,400గా  ప్రకటించింది.

1985 లో భారత్  బైక్ మార్కెట్లో అడుగిడిన యమహా,  2008 లో మిత్సు తో జతకట్టింది.ఈ  జాయింట్ వెంచర్ లో  ఎంట్రీ లెవల్  మొదలు  ప్రీమియం సూపర్ బైకుల  దాకా దేశీయ మార్కెట్ లో తన హవాను కొనసాగిస్తోంది.   భారతదేశంలో బైక్స్ అమ్మకాల్లో  55  శాతం వాటాను  కలిగివున్న యమహా మోటార్  కంపెనీ యువకులు  ముఖ్యంగా  గ్రామీణ  ప్రాంతాల మార్కెట్ లక్ష్యంగా  ఎంచుకుంది.  ఈ నేపథ్యంలో సాల్యుటో 125 మోడల్‌ ఫీచర్లతో పాటు మరిన్ని అధునాతన సదుపాయాలను జోడించి  ఈ బైక్‌ను  రూపొందించింది.

స్పెసిఫికేషన్స్

125 సీసీ, సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌, 4స్పీడ్‌ గేర్‌బాక్స్‌, టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యుయల్ షాక్ అబ్జార్బర్స్ , 7.4 బీహెచ్‌పీ పవర్‌, అనలాగ్ స్పీడో మీటర్, డ్రమ్  ఆటో మీటర్, అనలాగ్ ఫ్యూయల్ గాగ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. గత మోడళ్ల కంటే ఈ బైక్‌ 22కిలోల తక్కువ బరువు ఉంటుందని, లీటరుకు 82 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement