3 వేరియంట్లలో రెడ్‌మి 5 వచ్చేసింది | Sakshi
Sakshi News home page

3 వేరియంట్లలో రెడ్‌మి 5 వచ్చేసింది

Published Wed, Mar 14 2018 4:25 PM

Xiaomi Redmi 5 With 5.7-Inch Display Selfie Light Launched In India - Sakshi

రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌ను షావోమి లాంచ్‌ చేసింది. గతేడాది డిసెంబర్‌లో చైనాలో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌, నేడు భారత్‌ మార్కెట్‌లో కూడా ప్రవేశపెట్టింది. ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌ ఇండియా ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. మూడు వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌చేసింది. ఒకటి 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌. దీని ధర 7,999 రూపాయలుగా షావోమి ప్రకటించింది. రెండో వేరియంట్‌ 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌. దీని ధర 8,999 రూపాయలుగా పేర్కొంది. మరొకటి 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌. దీని ధర 10,999 రూపాయలుగా షావోమి తెలిపింది. ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌ ఇండియా‌లో, ఎంఐ.కామ్‌, ఎంఐ హోమ్‌ స్టోర్లలో  మార్చి 20 నుంచి ఈ ఫోన్‌ లభ్యమవుతుంది. 
లాంచ్‌ ఆఫర్లు.. 
100జీబీ అదనపు డేటాతో రిలయన్స్‌ జియో నుంచి 2,200 రూపాయల ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ను ఈ ఫోన్‌పై పొందొచ్చు. అమెజాన్‌ ఇండియా, ఎంఐ.కామ్‌లలో 5 శాతం డిస్కౌంట్‌ను ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుదారులకు అందించనుంది. తొలిసారి కిండ్లీ ఈబుక్స్‌ కొనే వారికి 90 శాతం తగ్గింపు లభించనుంది.

రెడ్‌మి 5 స్పెషిఫికేషన్లు..
5.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ఎస్‌ఓసీ
2జీబీ, 3జీబీ, 4జీబీ ర్యామ్‌ వేరియంట్లు
16జీబీ, 32జీబీ, 64జీబీ స్టోరేజ్‌ ఆప్షన్లు
మైక్రోఎస్డీ కార్డు ద్వారా విస్తరణకు అవకాశం
12 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా విత్‌ ఎల్‌ఈడీ సెల్ఫీ లైట్‌
ఫేస్‌ రికగ్నైజేషన్‌, స్మార్ట్‌ బ్యూటీ 3.0 యాప్‌
బ్లాక్‌, గోల్డ్‌, లేక్‌ బ్లూ, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లో అందుబాటు

Advertisement

తప్పక చదవండి

Advertisement