మండిన ‘టోకు ధరలు’ | Sakshi
Sakshi News home page

మండిన ‘టోకు ధరలు’

Published Tue, Oct 16 2018 12:57 AM

WPI inflation rises to 5.13% in September - Sakshi

న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2018 ఏడాది సెప్టెంబర్‌లో భారీగా 5.13 శాతంగా నమోదయ్యింది. అంటే ఈ బాస్కెట్‌ ధర 2017 ఇదే నెలతో పోల్చితే 5.13 శాతం పెరిగిందన్నమాట. ఇంధన, ఆహార ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం.

2017 సెప్టెంబర్‌లో టోకు ధరల సూచీ 3.14 శాతంగా ఉంటే,  2018 ఆగస్టులో ఈ రేటు 4.53 శాతం. కేంద్రం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే,  ఇంధనం, విద్యుత్‌ విభాగంలో ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 16.65 శాతంగా నమోదయ్యింది. పెట్రోలు, డీజిల్, ఎల్‌పీజీకి సంబంధించి ద్రవ్యోల్బణం వరుసగా 17.21 శాతం, 22.18 శాతం, 33.51 శాతం పెరిగాయి.

Advertisement
Advertisement