రూ.200 కోట్లతో వీకేటీ ఫార్మా ఏర్పాటు | VTK pharma manufacturing unit established with Rs.200 crores | Sakshi
Sakshi News home page

రూ.200 కోట్లతో వీకేటీ ఫార్మా ఏర్పాటు

Sep 20 2014 1:06 AM | Updated on Sep 2 2018 4:48 PM

రూ.200 కోట్లతో వీకేటీ ఫార్మా ఏర్పాటు - Sakshi

రూ.200 కోట్లతో వీకేటీ ఫార్మా ఏర్పాటు

రూ. 200 కోట్ల స్థూల పెట్టుబడితో శ్రీకాకుళంలోని ఇండస్ట్రియల్ కారిడార్‌లో వీకేటీ ఫార్మా ఉత్పాదక యూనిట్‌ను నెలకొల్పినట్లు సంస్థ అధినేత పొట్లూరి రమేష్‌బాబు తెలిపారు.

విశాఖపట్నం:  రూ. 200 కోట్ల స్థూల పెట్టుబడితో శ్రీకాకుళంలోని ఇండస్ట్రియల్ కారిడార్‌లో వీకేటీ ఫార్మా ఉత్పాదక యూనిట్‌ను నెలకొల్పినట్లు సంస్థ అధినేత  పొట్లూరి రమేష్‌బాబు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇండస్ట్రియల్ కారిడార్‌కి పునాదిలా అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీకేటీ ఫార్మా పెద్ద అడుగు వేసిందన్నారు. తాము ప్రమోట్ చేసిన మరో కంపెనీ ఎస్‌ఎంఎస్ ఫార్మా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాలకు పలు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. అల్సర్, మైగ్రేన్, ఫంగల్, హెచ్‌ఐవీ లాంటి వైద్యచికిత్సలో అవసరమయ్యే మందుల ఉత్పాదనలో అగ్రగామిగా కొనసాగుతున్నామన్నారు. తాజాగా శ్రీకాకుళంలో 75 ఎక రాల విస్తీర్ణంలో ఫార్మా రంగపు తొలిపరిశ్రమగా వీకేటీ ఆవిర్భవించిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement