స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ | State Bank Anywhere App | Sakshi
Sakshi News home page

స్టేట్ బ్యాంక్ ఎనీవేర్

Mar 14 2016 1:11 AM | Updated on Aug 20 2018 2:35 PM

స్టేట్ బ్యాంక్ ఎనీవేర్ - Sakshi

స్టేట్ బ్యాంక్ ఎనీవేర్

దేశీ పీఎస్‌యూ బ్యాంకు దిగ్గజం ఎస్‌బీఐ తన సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన...

Appకీ కహానీ...
దేశీ పీఎస్‌యూ బ్యాంకు దిగ్గజం ఎస్‌బీఐ తన సేవలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన యాప్ ‘స్టేట్ బ్యాంక్ ఎనీవేర్’. ఈ యాప్ సాయంతో మనం దైనందిన బ్యాంకింగ్‌ను నిర్వహించుకోవచ్చు. ‘స్టేట్ బ్యాంక్ ఎనీవేర్’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజర్లు ఈ యాప్‌ను ఇతర వెబ్‌సైట్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం అంత మంచిది కాదు.
 
ప్రత్యేకతలు
* యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్. యాప్‌ను ఓపెన్ చేయగానే మై అకౌంట్, బ్యాంకింగ్, బిల్ పేమెం ట్స్, టాప్‌అప్-రీచార్జ్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
* మై అకౌంట్‌లోకి వెళ్లితే ట్రాన్సాక్షన్ అకౌంట్, డిపాజిట్ ఖాతా, లోన్ అకౌంట్, పీపీఎఫ్ ఖాతాలు కనిపిస్తాయి. ఆయా అకౌంట్లైపై క్లిక్ చేసి సంబంధిత వివరాలను పొందొచ్చు. ఎం-పాస్‌బుక్ ద్వారా లావాదేవీల సమాచారం పొందొచ్చు.
* బ్యాంకింగ్ ఆప్షన్ ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. అది మన ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌లోకి కావచ్చు లేదా ఇతరుల ఖాతాల్లోకి కావచ్చు. అలాగే బ్యాంకింగ్ ఆప్షన్‌లో టీడీఎస్ ఎంక్వైరీ, ఫిక్స్‌డ్ డిపాజిట్, ఆధార్ సబ్సిడీ, ఏటీఎం/డెబిట్ కార్డ్ బ్లాక్, చెక్ బుక్ రిక్వెస్ట్, రికరింగ్ డిపాజిట్, క్రెడిట్ కార్డ్ ట్రాన్స్‌ఫర్, క్విక్ ట్రాన్స్‌ఫర్, స్టేట్ బ్యాంక్ ఎం-క్యాష్, ఐఎంపీఎస్ వంటి తదితర సేవలను పొందొచ్చు.
* బిల్‌పే ద్వారా బిల్లులకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించవచ్చు.
* టాప్‌అప్-రీచార్జ్‌లోకి వెళితే అక్కడ మొబైల్, డీటీహెచ్ సేవలను పొందొచ్చు. అంటే వాటిని రీచార్జ్ చేసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement