కొనుగోళ్ల జోరు, నిఫ్టీ 12200 పైకి నిఫ్టీ | Sakshi
Sakshi News home page

కొనుగోళ్ల జోరు, నిఫ్టీ 12200 పైకి నిఫ్టీ

Published Thu, Jan 9 2020 3:35 PM

Sensex Jumps 600 Points, Nifty Firm Above 12,200  - Sakshi

సాక్షి, ముంబై: స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. కీలక సూచీలు గత మూడు నెలల కాలంలో ఇదే అతిపెద్ద ఇంట్రా డ్రే లాభాలను సాధించాయి. ఆరంభం నుంచీ పటిష్టంగా కదిలి మిడ్‌ సెషన్‌ తరువాత మరింత ఎగిసిన సెన్సెక్స్‌  634 పాయింట్లు, నిఫ్టీ పాయింట్లు 190 ఎగిసాయి. తద్వారా  నిఫ్టీ 12200 కి ఎగువన స్థిరపడింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి.

ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగం భారీగా లాభపడింది. నిఫ్టీ బ్యాంకు ఏకంగా 700 పాయింట్లు ఎగిసింది.  వీటితోపాటు, మెటల్‌, ఆటో, టెలికాం  షేర్లు ర్యాలీ అయ్యాయి.  టాటామోటార్స్‌, ఐసీఐసీఐ, ఇండస్‌ ఇండ్‌, ఎస్‌బీఐ, ఎం అండ్‌ ఎం, మారుతి సుజుకి,యాక్సిస్‌ బ్యాంకు, యస్ బ్యాంకు, ఏసియన్‌ పెయింట్స్‌, మారుతి,  భారతి ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ గెయిల్‌, సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్, ఐఓసీ, బాంబే డైయింగ్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి.  అటు  టీసీఎస్‌, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌, బ్రిటానియా, విప్రో, ఎన్‌టీపీసీ స్వల్పంగా నష్టపోయాయి.

Advertisement
Advertisement