మార్కెట్ల జోరు : లాభాల స్వీకరణ | Sakshi
Sakshi News home page

మార్కెట్ల జోరు : లాభాల స్వీకరణ

Published Mon, Dec 17 2018 1:56 PM

Sensex Gains Over 300 Points, Nifty Above 10,850 - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు జోరుగా సాగుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే లాభాల డబుల్‌ సెంచరీ చేసిన సెన్సెక్స్‌ 36,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది.  ఒకదశలో 300పాయింట‍్లకు పైగా పుంజుకుంది. అయితే ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో స్వల్పంగా బలహీనపడి ప్రస్తుతం  సెన్సెక్స్‌ 216 పాయింట్ల లాభానికి పరిమితమై 36,179 వద్ద, నిఫ్టీ సైతం 51 పాయింట్లు పెరిగి 10,856 వద్ద కదులుతోంది. అయితే నిఫ్టీ 10850కి ఎగువన స్థిరపడుతుందా అనేది కీలకం.

దాదాపు అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా మెటల్‌ ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్‌ నిఫ్టీ షేర్లు లాభపడుతున్నాయి.  టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్, వేదాంతా, విప్రో, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కో, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్, టాటా స్టీల్‌  లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్‌ ఫిన్, ఐబీ హౌసింగ్‌, కొటక్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హీరో మోటో, ఇన్‌ఫ్రాటెల్‌, అల్ట్రాటెక్    నష్టపోతున్నాయి.
మరోవైపు  డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 24పైసలు పుంజుకుని 71.65 వద్ద ట్రేడ్‌అవుతోంది.
 

Advertisement
Advertisement