యువ పారిశ్రామికులకు ఎస్‌బీహెచ్ రుణాలు | SBH loans for young industrialist | Sakshi
Sakshi News home page

యువ పారిశ్రామికులకు ఎస్‌బీహెచ్ రుణాలు

Jul 11 2015 12:48 AM | Updated on Sep 3 2017 5:15 AM

యువ పారిశ్రామికులకు ఎస్‌బీహెచ్ రుణాలు

యువ పారిశ్రామికులకు ఎస్‌బీహెచ్ రుణాలు

చిన్న స్థాయి యువ పారిశ్రామిక వేత్తలకు రుణాలను మంజూరు చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్) ముందుకొచ్చింది...

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న స్థాయి యువ పారిశ్రామిక వేత్తలకు రుణాలను మంజూరు చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్‌బీహెచ్) ముందుకొచ్చింది. ఇందుకోసం భారతీయ యువశక్తి ట్రస్ట్‌తో ఎస్‌బీహెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఎస్‌బీహెచ్-బీవైఎస్‌టీ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ పోగ్రామ్’ పేరుతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం జూలై1 నుంచి అమల్లోకి వచ్చిందని, ఈ ఒప్పందం మూడేళ్ల పాటు అమల్లో ఉంటుందని ఎస్‌బీహెచ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం ఆమోదయెగ్యమైన వ్యాపార ప్రణాళిక ఉన్న  18 నుంచి 35 ఏళ్లలోపు మహిళలు, అంగవైకల్యం కలిగినవారికి, గ్రామీణ పట్టణ యువతకు రూ. 50 లక్షల వరకు ఎటువంటి గ్యారంటీ అవసరం లేకుండా రుణాలను అందిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement