హోండా అమేజ్, మొబిలియో ‘సెలబ్రేషన్ ఎడిషన్’ | Honda Launches Celebration Editions of Amaze | Sakshi
Sakshi News home page

హోండా అమేజ్, మొబిలియో ‘సెలబ్రేషన్ ఎడిషన్’

Sep 5 2015 12:33 AM | Updated on Sep 3 2017 8:44 AM

హోండా అమేజ్, మొబిలియో ‘సెలబ్రేషన్ ఎడిషన్’

హోండా అమేజ్, మొబిలియో ‘సెలబ్రేషన్ ఎడిషన్’

వచ్చే పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి ప్రముఖ కార్ల కంపెనీ హోండా ఇండియా తన కాంపాక్ట్ సెడాన్ అమేజ్, మల్టీ పర్పస్ వెహికల్ మొబిలియోలలో కొత్తగా సెలబ్రేషన్ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది...

న్యూఢిల్లీ: వచ్చే పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి ప్రముఖ కార్ల కంపెనీ హోండా ఇండియా తన కాంపాక్ట్ సెడాన్ అమేజ్, మల్టీ పర్పస్ వెహికల్ మొబిలియోలలో కొత్తగా సెలబ్రేషన్ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అమేజ్, మొబిలియోలలో కొత్త ఎడిషన్‌ను తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని, కస్టమర్లకు కొత్త ప్రాడక్ట్‌లను అందించడంలో కంపెనీ ఎప్పుడూ ముందుంటుందని హోండా ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. ఈ సెలబ్రేషన్ ఎడిషన్‌లో స్టైలిష్ బాడీ గ్రాఫిక్స్, ఎక్స్‌టీరియర్ డెకరేషన్ వంటి ప్రత్యేకతలు ఉంటాయని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement