స్టార్టప్‌లకు మంచి భవిష్యత్తు  | Sakshi
Sakshi News home page

స్టార్టప్‌లకు మంచి భవిష్యత్తు 

Published Thu, Mar 22 2018 1:41 AM

Better future for startups - Sakshi

జైపూర్‌:  స్టార్టప్‌లన్నింటికీ మంచి భవిష్యత్తు ఉందని ఐటీ రంగ కురువృద్ధుడు, ఇన్ఫోసిస్‌ మాజీ డైరెక్టర్‌ టీవీ మోహన్‌దాస్‌ పాయ్‌ చెప్పారు. అయితే వీటిల్లో 60 శాతం స్టార్టప్‌లు విఫలమవుతాయని పేర్కొ న్నారు.  తగిన మార్కెట్‌ లేకపోవడం, ఇతర అంశాలు దీనికి కారణాలని వివరించారు. తొలిసారి ఎంటర్‌ప్రైన్యూర్లు ప్రారంభించిన కారణంగా చాలా స్టార్టప్‌లు తగిన మార్కెట్‌ను పొందలేవని మణిపాల్‌ గ్లోబల్‌ ఎజుకేషన్‌కు చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న పాయ్‌ తెలిపారు. వ్యాపారం ఎలా నిర్వహించాలో ఈ తొలిసారి ఎంటర్‌ప్రెన్యూర్లకు తెలియకపోవచ్చని, వారు స్టార్టప్‌ వెంచర్లలో విఫలమైనా ఆ అనుభవం ఆ తర్వాత అక్కరకు వస్తుందని వివరించారు.

బాగా పనిచేసే స్టార్టప్‌లు మాత్రమే విజయం సాధిస్తాయని, మిగిలినవన్నీ విఫలమవుతాయని తెలిపారు. ఈ స్టార్టప్‌ పరిశ్రమ నైజమే అలాంటిదని వివరించారు.  భారత్‌లో ప్రస్తుతం 30,000 స్టార్టప్‌లు ఉన్నాయని, వీటిల్లో మొత్తం 3.5–4 లక్షల మంది పనిచేస్తున్నారని తెలిపారు. 2025 కల్లా భారత్‌లో లక్ష చురుకైన స్టార్టప్‌లు ఉంటాయని, వీటివల్ల 32 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వివరించారు. గత ఏడాది స్టార్టప్‌లకు 1,365 కోట్ల డాలర్ల నిధులు లభించాయని, ఇప్పుడు ఈ స్టార్టప్‌ల విలువ 9,500 కోట్ల డాలర్లకు పెరిగిందని పేర్కొన్నారు.  

Advertisement
Advertisement