బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌160 | Bajaj launches Pulsar NS160 priced at Rs 80648 | Sakshi
Sakshi News home page

బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌160

Jul 1 2017 12:18 AM | Updated on Sep 5 2017 2:52 PM

బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌160

బజాజ్‌ పల్సర్‌ ఎన్‌ఎస్‌160

ఆటోమొబైల్‌ దిగ్గజం బజాజ్‌ ఆటో శుక్రవారం 160సీసీ పల్సర్‌ ఎన్‌ఎస్‌160ని ఆవిష్కరించింది.

ధర రూ. 80,648 (ముంబై)
న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం బజాజ్‌ ఆటో శుక్రవారం 160సీసీ పల్సర్‌ ఎన్‌ఎస్‌160ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 80,648 (ముంబై ఎక్స్‌షోరూం)గా ఉంటుంది. ప్రీమియం నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాల స్టైల్, పనితీరు కోరుకునే యువ కస్టమర్ల కోసం దీన్ని తీర్చిదిద్దినట్లు కంపెనీ ప్రెసిడెంట్‌ (మోటార్‌సైకిల్స్‌ విభాగం) ఎరిక్‌ వాస్‌ తెలిపారు.

ప్రస్తుతం స్పోర్ట్స్‌ బైకింగ్‌ సెగ్మెంట్‌లో ఎక్కువగా 150–160 సీసీ మోటార్‌ సైకిల్సే ఉంటున్నాయని ఆయన తెలియజేశారు. ఇదే సీసీ సామర్ధ్యంలోనే మరింత మెరుగైన టెక్నాలజీ, పనితీరు కోరుకునే వారి కోసం ఎన్‌ఎస్‌ 160ని డిజైన్‌ చేసినట్లు వాస్‌ పేర్కొన్నారు. ఈ బైక్‌తో స్పోర్ట్స్‌ మోటార్‌సైకిల్స్‌ విభాగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement