అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ : బిగ్‌ డిస్కౌంట్స్‌ | Amazon Prime Day sale is back on July 16: Big discounts | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ : బిగ్‌ డిస్కౌంట్స్‌

Jul 3 2018 4:55 PM | Updated on Jul 3 2018 8:12 PM

Amazon Prime Day sale is back on July 16: Big discounts  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్  ప్రైమ్ డే సేల్ ను  లాంచ్‌ చేసింది.  ప్రతి సంవత్సరం లాగే ఈ  ఏడాది కూడా ప్రైమ్ డే సేల్ ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సేల్ ప్రత్యకంగా అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రమే. ఈ   స్పెషల్‌ సేల్‌ ఆఫర్‌  జులై 16 మధ్యాహ్నం నుండి జులై 18 అర్థరాత్రి వరకు అందుబాటులో ఉంటుంది.  దాదాపు 200లకు పైగా కొత్త ఉత్పత్తులను కస్టమర్లకు అందుబాటులో ఉంచనుంది. వన్‌ప్లస్‌, బాష్‌ ఇంటల్‌, హెచ్‌పీ, తదితర ఉత్పత్తులను డిస్కౌంట్‌ ధరల్లో ఆఫర్‌ చేయనుంది.  టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలు, ఇకో స్పీకర్లుతదితరాలపై వేలకొద్దీ ఆఫర్లను సిద్ధం చేసింది.

ముఖ్యంగా  స్మార్ట్‌ఫోన్లు, ఇతర యాక్ససరీస్‌ 40శాతం దాకా డిస్కౌంట్‌.. స్మార్టఫోన్ విభాగంలో శాంసంగ్‌, షావోమి, మోటో, హానర్, రియలల్‌మీ , హువాయ్, ఆపిల్, నోకియా, టెనోర్, ఎల్‌జీ  వివో బ్రాండ్‌పై డిస్కౌంట్లను అందిస్తుంది. అలాగే నో కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్చేంజ్‌ ద్వారా 3వేల దాకా క్యాష్‌ బ్యాక్‌  కూడా లభ‍్యం. దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్,  డెబిట్ కార్డ్‌ ద్వారా జరిపే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందవచ్చు. అలాగే అమెజాన్ పే వినియోగదారులకు 10 శాతం క్యాష్ బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉంది. ఇంకా, ప్రైమ్ డే సమయంలో, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్‌ను ప్రత్యేకంగా ప్రారంభించనుంది.  హిందీ, తమిళం, తెలుగు, పంజాబీ, మలయాళం, గుజరాతీ, రాజస్థానీ, బెంగాలీ సహా మరో రెండు కొత్త భాషలు అస్సామీ & ఒడియ లాంటి  భారతీయ భాషలలో ప్రత్యేకంగా  ప్లే జాబితాలు ప్రారంభించనుంది.

అయితే ప్రతి ఏడాదిలా 24 గంటలు సేల్ కాకుండా ఈ సారి 36  గంటలు పాటు ఈ డిస్కౌంట్‌ సేల్‌ నిర్వహించడం విశేషం. 'అల్ట్రా-ఫాస్ట్ 2-గంటల డెలివరీ' కూడా అని అమెజాన్‌ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement