తప్పు సరిదిద్దుకోనివ్వరూ? | VRO VRA Exam date | Sakshi
Sakshi News home page

తప్పు సరిదిద్దుకోనివ్వరూ?

Jan 17 2014 11:48 PM | Updated on Mar 28 2018 10:59 AM

గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుడి (వీఆర్‌ఏ) పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కొత్త చిక్కు వచ్చింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుడి (వీఆర్‌ఏ) పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కొత్త చిక్కు వచ్చింది. దరఖాస్తు ప్రక్రియలో తలెత్తిన తప్పులను సరిదిద్దే అవకాశం కల్పించకపోవడంతో వారిలో గందరగోళం నెలకొంది. మరో రెండు మూడు రోజుల్లో హాల్‌టికెట్లు జారీ కానుండగా కనీసం తప్పులు సరిదిద్దుకునే వెసులుబాటు కల్పించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఉద్యోగాలకు సంబంధించి డిసెంబర్ 28 నుంచి ఈ నెల 13వ తేదీ వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరించారు.
 
 వీఆర్‌ఓ పోస్టులకు 59,460 దరఖాస్తులు వచ్చాయి. అదే విధంగా వీఆర్‌ఏ పోస్టులకు 5,179 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసుకునే క్రమంలో పొరపాట్లు దొర్లాయి. అభ్యర్థులు కొందరు పొరపాటుగా తప్పుడు వివరాలు నమోదు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 12వేల దరఖాస్తుల్లో పొరపాట్లు చోటుచేసుకున్నట్టు అంచనా.  అయితే వాటిని సరిది ద్దుకునేందుకు వెబ్‌సైట్లో ప్రత్యేకంగా ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఈ వెసులుబాటు ఇచ్చినప్పటికీ.. ఈ దఫా అలాంటి సౌకర్యం కల్పించలేదు. వచ్చేనెల 2న పరీక్ష నిర్వహించాల్సి ఉండడంతో సీసీఎల్‌ఏ అధికారులు హాల్‌టిక్కెట్ల జారీకి కసరత్తు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో హాల్‌టిక్కెట్లు ఇవ్వడం ప్రారంభిస్తే మార్పులు చేసుకోవడం కష్టం. దీంతో హాల్‌టిక్కెట్ల జారీకి ముందే మార్పులు చేసుకునే అవకాశం కల్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement