నేటి ప్రధాన వార్తలు | Sakshi
Sakshi News home page

నేటి ప్రధాన వార్తలు

Published Sat, May 19 2018 7:56 PM

Today News Roundup 19th May  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బలపరీక్ష సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓటింగ్‌ జరుగడానికి ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. వాయిదా అనంతరం మధ్యాహ్నం 3:30కు ప్రారంభమైన సభలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప బలపరీక్ష తీర్మానంపై ప్రసంగిస్తూ.. మా దగ్గర 104 మంది ఎమ్మెల్యేల మాత్రమే ఉన్నారు కాబట్టి బలపరీక్షలో విఫలమయ్యామని చెప్పారు. ఈ సందర్భంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

బలపరీక్షలో ఓడిపోయాం: యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు: బలపరీక్ష సందర్భంగా కర్ణాటక అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓటింగ్‌ జరుగడానికి ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది.

కుమారస్వామికి పిలుపు.. నేడే సీఎంగా ప్రమాణం!
సాక్షి, బెంగళూరు: బల నిరూపణ పరీక్షకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించడంతో కర్ణాటక రాజకీయం ఊహించని మలుపుతిరిగింది. 

ఆపరేషన్‌ లోటస్‌.. అట్టర్‌ ఫ్లాప్‌
సాక్షి, బెంగళూరు: బల నిరూపణ కంటే ముందే యెడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వేళ.. కాంగ్రెస్‌-జేడీఎస్‌ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి

క్రికెట్‌ స్టేడియంలో రక్తపు ముద్దలు
కాబూల్‌: ఉగ్రదాడితో అఫ్ఘనిస్థాన్‌ మరోసారి నెత్తురోడింది. శుక్రవారం రాత్రి నంగర్‌హర్‌ ప్రొవిన్స్‌లోని ఓ క్రికెట్‌ స్టేడియంలో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి

ఘోరం: విమానం కూలి 100 మంది దుర్మరణం
హవానా :క్యూబా రాజధాని హవానాలోని జోస్‌ మార్టి విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం కూలి దాదాపు 100 మరణించారు

కథువా కేసు...గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు షాక్‌!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘కథువా అత్యాచార’ ఘటనకు సంబంధించి సోషల్‌ మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది

భారతీయుల డీఎన్‌ఏలోనే అవినీతి...
లక్నో: ఉత్తర ప్రదేశ్‌ మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్భర్‌ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అవినీతి అనేది భారతీయుల డీఎన్‌ఏలోనే ఉందని, దానిని రూపుమాపటం కష్టమైన పని ఆయన ప్రసంగించారు. 

గిరిజనులను చంద్రబాబు ఘోరంగా మోసం చేశారు: జగన్‌
 సాక్షి, గోపాలపురం : గిరిజనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా మోసం చేశారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు

అనుభవమున్న వ్యక్తి అని అధికారమిస్తే..
సాక్షి, గుంటూరు : ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి అని అధికారం ఇస్తే ప్రశ్నించే గొంతుకులను అణచివేసే సంస్కృతిని తీసుకొచ్చారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి.

‘వచ్చే ఎన్నికలు ఏకపక్షమే’
సాక్షి, హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగానే ఉంటాయి. రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు.

టీ20ల్లో ధోని అరుదైన రికార్డు
న్యూఢిల్లీ : చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు

భారత ఆర్థికవ్యవస్థకు చమురు సెగ
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న భారత్‌ను చమురు ధరల సెగ ప్రభావితం  చేయనుందని ప్రముఖ ఆర్థిక ఎనలిస్టులు  సంస్థలు విశ్లేషిస్తున్నారు.

కాస్టింగ్‌ కౌచ్‌ : నటి ఆశ్చర్యకర సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: సిని పరిశ్రమలో కలకలం రేపిన ‘కాస్టింగ్‌ కౌచ్‌’ గురించి పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వినిపించిన సంగతి తెలిసిందే

Advertisement

తప్పక చదవండి

Advertisement