స్కూల్ బస్సు - బైక్ ఢీ.. మహిళ మృతి | School bus - bike collided woman killed | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సు - బైక్ ఢీ.. మహిళ మృతి

Dec 3 2015 9:18 AM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న స్కూలు బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరో పాప తీవ్రంగా గాయపడింది.

వేగంగా వెళ్తున్న స్కూలు బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరో పాప తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా చెన్నూరు మండలం చిన్నమాసుపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకంది. కడప నుంచి చెన్నూరు వెళ్తున్న స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న సుభాషిణి(28) అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె కూతురు గౌరి(5)కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement