రేవ్ పార్టీపై పోలీసులు దాడి: 25 మంది అరెస్ట్ | Rave party in Mahabubnagar district, 25 people arrested | Sakshi
Sakshi News home page

రేవ్ పార్టీపై పోలీసులు దాడి: 25 మంది అరెస్ట్

Mar 2 2014 8:37 AM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న రేవ్ పార్టీపై శనివారం అర్థరాత్రి పోలీసులు అకస్మికంగా దాడి చేశారు.

మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న రేవ్ పార్టీపై శనివారం అర్థరాత్రి పోలీసులు అకస్మికంగా దాడి చేశారు. 22 మంది యువకులు, ముగ్గురు యువతులను షాద్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. షాద్నగర్ సమీపంలోని ఫరూఖ్నగర్ మండలం మధురానగర్లోని ఓ ప్రైవేట్ రిసార్ట్స్లో రేవ్ పార్టీ జరుతుందని పోలీసులకు సమాచారం అందింది.

 

దాంతో పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో యువతి, యువకులు మద్యం సేవించి నృత్యాలు చేస్తున్నారు. దాంతో వారిని స్టేషన్కు తరలించి, వారిపై కేసులు నమోదు చేశారు. అయితే రేవ్ పార్టీలో పట్టుబడిన ముగ్గురు యువతులు ముంబై నగరానికి చెందని వారని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement