కాంగ్రెస్ దుకాణం బంద్...!

కాంగ్రెస్ దుకాణం బంద్...! - Sakshi

పాచిపెంట,న్యూస్‌లైన్: సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా ఏజెన్సీ రాజకీయాల్లో నూతనోత్తేజం కలిగించారు. కాంగ్రెస్‌కు కష్టకాలం దాపురించింది. దీంతో అక్కడ ఆ పార్టీ దుకా ణం బంద్ అయినట్లేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా పేరున్న రాజన్న దొర మొదట్నుంచీ వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమాని. ఆయన ఆశీస్సులతోనే దొర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే మహానేత వైఎస్ మరణానంతరం రాష్ట్రరాజకీయాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ రాజన్నదొర మాత్రం కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వచ్చారు. అయితే ఆయన పరిస్థితి రోజురోజుకూ ఇబ్బందికరంగా మారడం, నియోజకవర్గంలోని పాలనా వ్యవహారాలు సైతం విజయనగరం నుంచి షాడోనేతే పర్యవేక్షిస్తుండడంతో దొర అనుచరుల్లో ఆవేదన వ్యక్తమయ్యేది. 

 

 అయినప్పటికీ ఏమీ  చేయలేని పరిస్థితుల్లో కొన్నాళ్లు అలాగే ఉన్నారు. ఇదే తరుణంలో రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్లు తేటతెల్లమవడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైం ది. రాజన్న ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి వారు కోరిన మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్‌ఆర్‌సీపీలో ఆయన చేరికతో పా చిపెంట, మెంటాడ, సాలూరు, మక్కువ మం డలాల్లో రాజకీయ సంచలనం రేగింది. రాజన్నతోపాటు జరజాపు ఈశ్వరరావు, పాచిపెంట మండలం నుంచి మరో 13మంది సర్పంచ్‌లు పార్టీలో చేరారు. రాజన్న దొర హైదరాబాద్ నుంచి వచ్చాక కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొం దిస్తారు. ఈలోగా ఆయా మండలాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీపీలు,  ఎం పీటీసీ మాజీ  సభ్యులు సైతం ఇదే బాటన ప యనించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 

 

 కాంగ్రెస్‌లో నైరాశ్యం

 ఇదిలా ఉండగా అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఈ పరిణామం నైరాశ్యాన్ని నింపింది. దొర నిష్ర్కమణతో కాంగ్రెస్‌కు నియోజకవర్గంలో పెద్దదిక్కే లేకుండా పోయింది. అంతేకాకకుండా ఇప్పుడు తమను నడిపించే నాయకుడెవరన్న ప్రశ్న వారిలో ఆందోళన కలిగిస్తోంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చేందుకు కనీసం మండల స్థాయి నేత కూడా దొరకని పరిస్థితి నెలకొంటుందని మక్కువ మండలానికి చెందిన ఓ సర్పంచ్ నిర్వేదం వ్యక్తం చేశారు.

 

 దొర చేరికతో గిరిజనుల్లో సైతం ఉత్సాహం నెలకొంది.

 తాము మొదట్నుంచీ అభిమానించే రాజశేఖరరెడ్డి తనయుడు ఏర్పాటు చేసిన పార్టీలోకి దొర వెళ్లడం చాలా ఆనందకరమని పణుకువలస, పి.కోనవలస, వేటగానివలస తదితర గిరిజన గ్రామాలకు చెందిన యువకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల్లో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుందని, దుకా ణం బంద్ అయినట్లేనని వారు చెబుతున్నారు. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top