గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం | Passengers spot smoke on the Gorakhpur Express | Sakshi
Sakshi News home page

గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం

May 2 2014 8:36 AM | Updated on Oct 22 2018 2:14 PM

గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది.

గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. ఎక్స్ప్రెస్ బోగీలో పొగలు ఒక్కసారిగా వ్యాపించడంతో ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. దాంతో చైన్ లాగీ  ఎక్స్ప్రెస్ రైలును పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని భీమడోలు రైల్వేస్టేషన్లో నిలిపివేసి... రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పొగలు వ్యాపించడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. గోరఖ్పూర్ నుంచి హిందూపురం వెళ్తుండగా ఆ ఘటన చోటు చేసుకుంది. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ నుంచి ఇంజన్ను డ్రైవర్ వేరు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement