చివరకు మిగిలేది... | municipal elections Nominations Withdrawal deadline Tuesday evening | Sakshi
Sakshi News home page

చివరకు మిగిలేది...

Mar 18 2014 12:41 AM | Updated on Aug 24 2018 2:33 PM

పురపాలక సంఘాల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రం మూడు గంటలకు ముగియనుంది. జిల్లాలోని 12 పురపాలక సంఘాల ఎన్నికలను

సాక్షి, గుంటూరు :పురపాలక సంఘాల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రం మూడు గంటలకు ముగియనుంది. జిల్లాలోని 12 పురపాలక సంఘాల ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ అధికమైంది. మొత్తం 2,601 నామినేషన్లు దాఖలు కాగా, తిరస్కరణ అనంతరం 2,271 మిగిలాయి. వాటిలో సోమవారం 147 నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యే సమయానికి ఎన్నికల బరిలో మిగిలే అభ్యర్థుల జాబితా విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 
 
 ప్రలోభాలు, బెదిరింపులు... 
 పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్నీ పార్టీల నుంచి ఔత్సాహికులు ముందుకు రావడంతో  ఏంచేయాలో పాలుపోని రాజకీయపార్టీలు అందరి చేత నామినేషన్లు దాఖలు చేయించాయి. ఉపసంహరణకు మంగళవారం సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే సమయం ఉండటంతో రెబల్స్‌ను బుజ్జగించే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఒకే పార్టీ నుంచి రెండు లేదా మూడు నామినేషన్లు ఉంటే ఇబ్బందికరమని భావించిన నేతలు వారిని నయానో, భయానో ఉపసంహరించుకునేలా ఒప్పిస్తున్నారు. అప్పటికీ లొంగని అభ్యర్థులకు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు డబ్బు ఎర చూపి వారిని ప్రలోభ పెట్టైనా సరే రెబల్ బెడద లేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ తరహా ఉపసంహరణలు ముఖ్యంగా టీడీపీ నాయకులకు తలనొప్పిగా మారాయి. ఇదిలావుంటే, పురపాలక సంఘాల్లో బలంగా వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక మిగిలిన పార్టీలు ఏకమవుతున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement