breaking news
Nominations Withdrawal deadline
-
ఇంట్లో ఇల్లాలు.. బరిలో ప్రత్యర్థి!
సాక్షి, విశాఖపట్నం: రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు వారివి. ఒకటికి రెండు అడుగులు ముందుగా ఆలోచించి, ఏ చిన్న రిస్క్ లేకుండా ‘బ్యాకప్’ పెట్టుకోవడం నేతలకు కొత్తేం కాదు. కానీ, ఆ బ్యాకప్ కాస్తా రివర్స్ అయితే? సరిగ్గా ఇదే సీన్ విశాఖ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మంతెన మురళి నాగ పరశురామరాజు గారికి ఎదురైంది. ఇప్పుడు ఈ వార్డు పాలిటిక్స్ టాలీవుడ్ సినిమాను తలపిస్తూ.. స్థానికంగా ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. అసలేం జరిగిందంటే..? కూటమి పొత్తులో భాగంగా జీవీఎంసీ 54వ వార్డు బీజేపీకి కేటాయించడంతో, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు బరిలోకి దిగారు. అనుభవం ఉన్న నాయకుడే అయినా, ఎన్నికల్లో ఏమైనా తేడా కొడితే సేఫ్ సైడ్ ఉండాలని భార్య మంతెన అమృత పాలవల్లి దేవి చేత ‘డమ్మీ’ నామినేషన్ వేయించారు. కానీ అసలు క్లైమాక్స్ అక్కడే మొదలైంది. పెళ్లి రోజు, భార్య పుట్టినరోజు మర్చిపోయే సగటు భర్తలాగే.. మన లీడర్గారు నామినేషన్ల ఉపసంహరణ గడువు తేదీని పూర్తిగా మర్చిపోయారు. తీరా గడువు ముగిశాక గుర్తొచ్చి ఎన్నికల అధికారుల చుట్టూ పరుగులు పెట్టినా ఫలితం లేకపోయింది. ‘నో ఛాన్స్.. మీ ఆవిడ కూడా బరిలో ఉన్నారు’ అని అధికారులు తేల్చి చెప్పేసరికి ఆయనకు మైండ్ బ్లాంక్ అయింది. ‘డమ్మీ’ కాస్తా.. డైరెక్ట్ ప్రత్యర్థి! డమ్మీగా వేసిన ఆవిడ ఇప్పుడు తుది బరిలో ‘స్వతంత్ర’ అభ్యర్థిగా భర్తకే పోటీగా నిలిచారు. దీంతో ఆ వార్డులో ఎన్నికల పోరు కాస్తా రసవత్తరమైన ‘ఇంటి పోరు’గా మారిపోయింది. ఇప్పుడు ఈ రివర్స్ సీన్‌పై సోషల్ మీడియాలో, స్థానికంగా రకరకాల సెటైర్లు పేలుతున్నాయి. ‘పొద్దున్నే లేచి ఒకరి మొహం ఒకరు చూసుకుని ఒకే ఇంట్లోంచి ఇద్దరు అభ్యర్థులు ప్రచారానికి వెళ్తుంటే ఆ సీన్ చూడ్డానికి రెండు కళ్లు చాలవు‘ అని జనాలు నవ్వుకుంటున్నారు.‘డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరి ఓట్లు వాళ్లు లెక్కేసుకుంటున్నారా?‘, ‘ఏవండీ.. నా ఓట్లు మీరు లాక్కోకండి అని ఇంట్లోనే వార్నింగ్‌లు ఇచ్చుకుంటున్నారా?‘ అంటూ కూటమి నేతలు సైతం కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. భార్యని డమ్మీ అనుకుంటే పక్కలో బల్లెంలా తయారైందని సెటైర్లు వేస్తున్న స్థానికులు.. ‘సొంత భార్య వేసిన నామినేషనే వెనక్కి తీయించుకోలేని ఈ నాయకులు.. ఇక వార్డును ఏం ఉద్ధరిస్తారబ్బా!’ అంటూ ఘాటైన సెటైర్లు కూడా పేలుస్తున్నారు. ఇదీ చదవండి: మాధవి మళ్లీ బరిలోకి.. -
పోలవరం బరిలో 9 మంది
హైదరాబాద్: సీమాంధ్రలో నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. ఎన్నికల బరిలో ఎంత మంది ఉన్నారనే విషయాన్ని ఎన్నికల సంఘం వెల్లడించింది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ స్థానానికి 9 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. గోపాలపురంలో ఏడుగురు, కొవ్వూరులో 13 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానానికి బరిలో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చంద్రగిరి-5, మదనపల్లి- 19, తంబళ్లపల్లి- 15, పీలేరు- 15, కుప్పం - 8, నగిరి- 7, సత్యవేడు-14, గంగాధరనెల్లూరు-13, చిత్తూరు-15, పూతలపట్టు- 6, పలమనేరులో 8 మంది పోటీ చేస్తున్నారు. -
చివరకు మిగిలేది...
సాక్షి, గుంటూరు :పురపాలక సంఘాల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రం మూడు గంటలకు ముగియనుంది. జిల్లాలోని 12 పురపాలక సంఘాల ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ అధికమైంది. మొత్తం 2,601 నామినేషన్లు దాఖలు కాగా, తిరస్కరణ అనంతరం 2,271 మిగిలాయి. వాటిలో సోమవారం 147 నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యే సమయానికి ఎన్నికల బరిలో మిగిలే అభ్యర్థుల జాబితా విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రలోభాలు, బెదిరింపులు... పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్నీ పార్టీల నుంచి ఔత్సాహికులు ముందుకు రావడంతో ఏంచేయాలో పాలుపోని రాజకీయపార్టీలు అందరి చేత నామినేషన్లు దాఖలు చేయించాయి. ఉపసంహరణకు మంగళవారం సాయంత్రం 3 గంటల వరకు మాత్రమే సమయం ఉండటంతో రెబల్స్‌ను బుజ్జగించే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. ఒకే పార్టీ నుంచి రెండు లేదా మూడు నామినేషన్లు ఉంటే ఇబ్బందికరమని భావించిన నేతలు వారిని నయానో, భయానో ఉపసంహరించుకునేలా ఒప్పిస్తున్నారు. అప్పటికీ లొంగని అభ్యర్థులకు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు డబ్బు ఎర చూపి వారిని ప్రలోభ పెట్టైనా సరే రెబల్ బెడద లేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ తరహా ఉపసంహరణలు ముఖ్యంగా టీడీపీ నాయకులకు తలనొప్పిగా మారాయి. ఇదిలావుంటే, పురపాలక సంఘాల్లో బలంగా వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక మిగిలిన పార్టీలు ఏకమవుతున్నాయి.


