గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం | Sakshi
Sakshi News home page

గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం

Published Wed, Jan 28 2015 6:26 PM

గుంటూరులో భారీ అగ్ని ప్రమాదం - Sakshi

గుంటూరు: ఆటోనగర్ నాలుగో ఫేజ్‌లో బుధవారం కార్తీక సెమీ కాస్టింగ్స్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెయింటింగ్‌లో కలిపే లిక్విడ్‌లని ఈ కంపెనీలో తయారు చేస్తారు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.
బాధితులను స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే స్థానిక ఫైర్ ఇంజన్లు వెంటనే వచ్చాయి.అగ్ని కీలలు భారీగా ఎగసిపడటంతో పొన్నూరు, తెనాలి నుంచి అగ్నిమాపక ఇంజన్లను రప్పిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement