ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య | inter student commits suicide | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Apr 20 2016 3:04 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - Sakshi

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

చెంచురెడ్డిగారిపల్లెకు చెందిన పూజిత(16) అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని తక్కువ మార్కులు వచ్చాయని...

సంబేపల్లె: చెంచురెడ్డిగారిపల్లెకు చెందిన పూజిత(16) అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని తక్కువ మార్కులు వచ్చాయని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. సంబేపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అమరనాథరెడ్డి, వెంకటేశ్వరమ్మ రెండవ కుమార్తె పూజిత. విజయవాడ చైతన్య కాలేజీలో ఇంటర్ బైపీసీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసింది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో 440కి గాను 406 మార్కులు వచ్చాయి. ఇతరుల కంటే తనకు తక్కువ మార్కులు వచ్చాయని విష ద్రావణం తాగింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement