కీచక టీచర్ | Indecent behavior with Students | Sakshi
Sakshi News home page

కీచక టీచర్

Oct 3 2015 1:48 PM | Updated on Sep 2 2018 4:48 PM

విద్యాబుద్ధులు నేర్పించాల్సి ఉపాధ్యాయుడు చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

విద్యాబుద్ధులు నేర్పించాల్సి ఉపాధ్యాయుడు చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించాడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం సిర్శువాడ గ్రామంలోని ప్రాథమికోన్సత పాఠశాలలో శనివారం వెలుగు చూసింది.

పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఉమాపతి ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విధ్యార్థినులతో గురువారం అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం విద్యార్థినులు తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఇవాళ స్కూల్ కు చేరుకున్న గ్రామస్థులు ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేశారు. అనంతరం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
 

Advertisement
 
Advertisement
Advertisement