‘పెళ్లి క్యాన్సిల్ చేసుకుని.. నాతో రా’... | hyderabad young man halchal at love house | Sakshi
Sakshi News home page

‘పెళ్లి క్యాన్సిల్ చేసుకుని.. నాతో రా’...

May 10 2014 4:28 PM | Updated on Sep 4 2018 5:07 PM

పెళ్లిని రద్దు చేసుకొని తనతో రావాలని ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి యువతి ఇంటి వద్ద హల్‌చల్ చేశాడు.

హైదరాబాద్: పెళ్లిని రద్దు చేసుకొని తనతో రావాలని ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి యువతి ఇంటి వద్ద హల్‌చల్ చేశాడు. ఈ సంఘటన కార్ఖానా పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటనకు కారకులైన ముగ్గురు యువకులపై నిర్భయ కేసును నమోదు చేశారు. ఎస్‌ఐ విజేయందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గన్‌రాక్ ప్రాంతానికి చెందిన యువతి(18) ఇంటికి గురువారం రాత్రి అమీర్‌పేట్ ప్రాంతానికి చెందిన ఆజాద్(23), వంశీ(24) వేణుగోపాల్(23)లు వెళ్లారు.

శనివారం జరగబోయే ఆమె వివాహన్ని రద్దు చేసుకుని తనను పెళ్లి చేసుకోవాలని ఆజాద్ తన స్నేహితులతో కలిసి గొడవపడ్డాడు. అడ్డు చెప్పిన కుటుంబ సభ్యులతో ఈ ముగ్గురు వాగ్వివాదానికి దిగారు. భయాందోళనకు గురైన యువతి కుటుంబ సభ్యులు కార్ఖానా పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై శుక్రవారం నిర్భయ చట్టం కింద కేసును నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement