కత్తిపీటతో భార్యను నరికిన భర్త | husband murder attempt on his wife | Sakshi
Sakshi News home page

కత్తిపీటతో భార్యను నరికిన భర్త

Mar 16 2015 6:18 PM | Updated on Jul 30 2018 8:29 PM

ఎల్లప్పుడూ తన క్షేమం కోరే అర్ధాంగిని కత్తిపీటతో నరికి చంపబోయాడు ఓ కిరాతకుడు

కొత్తపల్లి : ఎల్లప్పుడూ తన క్షేమం కోరే అర్ధాంగిని కత్తిపీటతో నరికి చంపబోయాడు ఓ కిరాతకుడు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో సోమవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం... మూలపేట గ్రామానికి చెందిన గంగాభవానీ(35) అనే మహిళను ఆమె భర్త అర్జున్ కత్తిపీట తీసుకుని మెడపై వేటు వేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

 

పరిస్థితి విషమంగా ఉండడంతో బాధితురాలిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. కాగా ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement