నాలుగేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు | four years girl child raped and murderd brutally | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు

Apr 21 2015 4:39 PM | Updated on Jul 28 2018 8:44 PM

నాలుగేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు - Sakshi

నాలుగేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు

జిల్లాలోని కావలిలో దారుణం జరిగింది. అభంశుభం ఎరుగని నాలుగేళ్ల చిన్నారిపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడి, ఆ తరువాత అత్యంత పాశవికంగా రాళ్లతో కొట్టి చంపారు.

జిల్లాలోని కావలిలో దారుణం జరిగింది. అభంశుభం ఎరుగని నాలుగేళ్ల చిన్నారిపై గుర్తుతెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడి, ఆ తరువాత అత్యంత పాశవికంగా రాళ్లతో కొట్టి చంపారు. కావలి శివారు ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని బలవంతంగా పొదలమాటుకు ఎత్తుకెళ్లిన దుండగులు.. అరుపులు వినిపించకుండా పాప నోట్లో దుస్తులు కుక్కి అత్యాచారం జరిపారు. ఆ తరువాత పక్కనే ఉన్న బండరాళ్లలో చిన్నారిని చితగొట్టి చంపేశారు. పొదల్లో శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించి, దుండగుల కోసం వేటసాగిస్తున్నారు. పాప తల్లిదండ్రులు కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. దాడి సమయంలో ఇంట్లో ఎవరూ లేరు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement