తెలుగు తమ్ముళ్లకు హరి ఝులక్! | Edara Haribabu shock to TDP in ZP Chairman Election | Sakshi
Sakshi News home page

తెలుగు తమ్ముళ్లకు హరి ఝులక్!

Jul 14 2014 10:56 AM | Updated on Sep 2 2017 10:17 AM

తెలుగు తమ్ముళ్లకు హరి ఝులక్!

తెలుగు తమ్ముళ్లకు హరి ఝులక్!

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అడ్డదారులు తొక్కుతున్న టీడీపీకి ఆ పార్టీకే చెందిన తిరుగుబాబు అభ్యర్థి ఈదర హరిబాబు ఝులక్ ఇచ్చారు.

ఒంగోలు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అడ్డదారులు తొక్కుతున్న టీడీపీకి ఆ పార్టీకే చెందిన తిరుగుబాబు అభ్యర్థి ఈదర హరిబాబు ఝులక్ ఇచ్చారు. దౌర్జన్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని సొంతం చేసుకునేందుకు పచ్చబాబులు పన్నిన కుయుక్తులను పటాపంచలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండతో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దక్కించుకున్నారు.

మెజారిటీ లేకపోయినా జెడ్పీ పీఠంపై కన్నేసిన తెలుగు తమ్ముళ్లకు హరిబాబు తగిన గుణపాఠం చెప్పారు. అధికార మదంతో అడ్డదారిలో పదవి దక్కించుకుందామన్న టీడీపీ కుతంత్రానికి అడ్డుకట్ట వేశారు. అరాచకాండతో ప్రజల తీర్పును అపహాస్యం చేయాలని చూసిన సైకిల్ పార్టీకి చెక్ పెట్టారు. తాము తీసిన గోతిలో తామే పడి తెలుగు తమ్ముళ్లు గిల గిల తన్నుకుంటున్నారు.

తప్పుడు కేసులో మార్కాపురం జెడ్పీటీసీని అరెస్టు చేయించి తన కుట్రకు తెరలేపింది. ఇక్కడ నుంచి పరిణమాలు వేగంగా మారిపోయాయి. గెలుపు తమదే ఉన్న దీమాతో ఉన్న టీడీపీకి వైఎస్ఆర్ సీపీ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. స్వతంత్ర అభ్యర్థి హరిబాబుకు మద్దతు ప్రకటించి జెడ్పీ పీఠం కట్టబెట్టింది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన వైఎస్ఆర్ సీపీకి వైస్ చైర్మన్ పదవి దక్కింది. రెండు పదవులు కోల్పోయి తెలుగు తమ్ముళ్లు ఖిన్నులయ్యారు. పలు జిల్లాల్లో దౌర్జన్యంగా జెడ్పీటీసీ పదవులు దక్కించుకున్న టీడీపీ నాయకులు సీన్ రివర్స్ అయ్యే సరికి ఆగమాగం అవుతున్నారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement