డిప్లమో కోర్సు నిర్వహణకు ఒప్పందం | Diploma course management contract | Sakshi
Sakshi News home page

డిప్లమో కోర్సు నిర్వహణకు ఒప్పందం

Jul 13 2016 12:59 AM | Updated on Sep 2 2018 4:48 PM

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో పీజీ డిప్లమో ఇన్ మెడికల్ రికార్డ్సు హెల్త్ ఆర్గనైజేషన్ కోర్సు

ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో పీజీ డిప్లమో ఇన్ మెడికల్ రికార్డ్సు హెల్త్ ఆర్గనైజేషన్ కోర్సు నిర్వహ ణకు బొల్లినేని మెడిస్కిప్సు సంస్థతో మంగళవారం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు వర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుంట తులసీరావు, బొల్లినేని సంస్థ సెంటర్ హెడ్ సీహెచ్ నాగేశ్వరరావు, అకడమిక్ డెరైక్టర్ లక్ష్మీ శైలజ పరస్పరం ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
 
  ఏడాది కాలపరిమితి గల ఈ కోర్సు చదివేందుకు డిగ్రీ అర్హత. 35 ఏళ్లులోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 70 శాతం ప్రాక్టికల్, 30 శాతం థియరీ పద్ధతిలో ఉండే ఈ కోర్సు ఫీజు రూ.20 వేలు. రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో తరగతులు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణ, ధ్రువీకరణ పత్రాల జారీ తదితర ప్రక్రియలను వర్సిటీ చేపట్టనుంది. ఈ ఏడాది నుంచే కోర్సు ప్రారంభం కానుంది. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పెద్దకోట చిరంజీవులు, ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement