విజయసాయిరెడ్డికి అభినందనలు | Congratulations Vijayasaireddy | Sakshi
Sakshi News home page

విజయసాయిరెడ్డికి అభినందనలు

May 27 2016 1:50 AM | Updated on Aug 9 2018 2:44 PM

విజయసాయిరెడ్డికి అభినందనలు - Sakshi

విజయసాయిరెడ్డికి అభినందనలు

రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి.....

ఇబ్రహీంపట్నం : రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి కృష్ణాజిల్లాకు చెందిన  వైఎస్సార్ సీపీ నాయకులు గురువారం అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో అసెంబ్లీ సచివాలయ ప్రాంగణంలో విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.  కార్యక్రమానికి జిల్లా నుంచి నాయకులు తరలివెళ్లారు.

అభినందనలు తెలిపిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి సామినేని ఉదయభాను, గుడివాడ, తిరువూరు, నూజివీడు ఎమ్మెల్యేలు కొడాలి నాని, రక్షణనిధి, మేకా ప్రతాప్‌అప్పారావు,   జి.కొండూరు ఎంపీపీ వేములకొండ తిరుపతిరావు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాదు శివరామకృష్ణ, కైకలూరు నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement