సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నేటి నుంచి కౌన్సెలింగ్ | Civil Assistant Surgeons counselling | Sakshi
Sakshi News home page

సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు నేటి నుంచి కౌన్సెలింగ్

Feb 5 2014 1:33 AM | Updated on Sep 4 2018 5:07 PM

రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో నియామకాల కోసం సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్)లకు బుధవారం నుంచి రెండు రోజులపాటు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

ఎన్టీఆర్ హెల్త్‌వర్సిటీలో ఉదయం 10 గంటల నుంచి మొదలు


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో నియామకాల కోసం సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్)లకు బుధవారం నుంచి రెండు రోజులపాటు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కుటుంబ సంక్షేమ శాఖ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. మొత్తం 1,239 మంది వైద్యులతో తుది జాబితా రూపొందించారు. వీరంతా బుధవారం ఉదయం 10 గంటలకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్‌కు రావాల్సి ఉంటుంది. ఎంపిక కమిటీలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, ఆరోగ్య శాఖ డెరైక్టర్, వైద్యవిధాన పరిషత్ కమిషనర్, వైద్యవిద్య డెరైక్టర్‌ల ఆధ్వర్యంలోనే కౌన్సెలింగ్ జరుగుతుంది. మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తారు.

 

Advertisement
 
Advertisement
Advertisement